పొలిటికల్ పవర్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ పాండు రంగా రావు జూన్ 05 2026: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ : కీసర సర్కిల్ జవహర్ నగర్ మేడ్చల్ నియోజకవర్గం గత శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి జవహర్ నగర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న సమయంలో గృహ నిర్మాణాలకు అనుమతులు లేక గృహ నిర్మాణాలు చేసుకోలేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులతో పాటు పాలకమండలి సభ్యుల అభ్యర్థన మేరకు అప్పటి ఎం.ఎల్.ఏ. మలిపెద్ది సుధీర్ రెడ్డి 318 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాసాలను గ్రామ కంఠంగా గుర్తించి, జవహర్ నగర్ ప్రాంతం పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గృహ నిర్మాణాల అనుమతులతో పాటు అన్ని విధాలుగా పంచాయతీ అనుమతులు లభించే వెసులుబాటును కల్పించి గతంలో, ఇసుమంత అభివృద్ధికి నోచుకోని జవహర్ నగర్ కు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించి భూగర్భ డ్రైనేజీలు, సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, ఓపెన్ డ్రైనేజీలు వేయించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. జవహర్ నగర్ ప్రాంతాన్ని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాంగ ఎదిగేందుకు ఎం ఎల్ ఏ మలిపెద్ది సుధీర్ రెడ్డి కృషి చేస్తే, నేడు జవహర్ నగర్ లో గృహ నిర్మాణాలకు అనుమతులు ఎలారద్దు చేస్తారు అని నిలదీయలేక… విలేకరులపై రుస రుస లాడుతూ విసురులెందుకూ…?
మాజీ మంత్రి నేటి మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డిని నిలదీయకపోవడం స్థానికుల తప్పిదం కాదా…?
తదుపరి మేడ్చల్ నియోజకవర్గం ప్రజల సేవకుడిలా సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ అర్ధించి మోసపూరిత ప్రసంగాలతో ప్రధానంగా జవహర్ నగర్ ప్రజల ఓట్లతో గెలిచి గద్దెనెక్కాక ఆదరించి మంత్రి పదవిని అధిష్టించే భాగ్యాన్ని కలగజేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి, జవహర్ నగర్ స్థానికులకు ప్రత్యేకంగా అవసరమైన జవహర్ నగర్ అభివృద్ధికి అత్యంత అవసరమైన ఇండ్ల పర్మిషన్లు రద్దు చేసి కుట్రపూరిత రాజకీయానికి తెరలేపిన మల్లారెడ్డిని గ్రామపంచాయతీ హయంలోనే ఇచ్చిన గృహ నిర్మాణాల అనుమతులు నేడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా ఎదిగిన ఈ సమయంలో గృహ నిర్మాణాల అనుమతులు రద్దు చేయడం ఏమిటి?. గృహ నిర్మాణాల అనుమతులు ఇచ్చేంతవరకు మీ ఇండ్లను, క్యాంప్ ఆఫీస్ లను ముట్టడిస్తామని హెచ్చరించి నాటి మంత్రి పదవి నుండి నేడు ఎంఎల్ఏగా కొనసాగుతున్న మల్లారెడ్డిని నిలదీయడంపై చూపలేని విసురులు, రుస రుసలు విలేకరులపై ఎందుకూ…?
కార్పొరేటర్లకు తొత్తులుగా వ్యవహరించడం తప్పు కాదా…?
ఊరును ఉద్దరిస్తామని స్థానికుల సమస్యలు పరిష్కరిస్తామని కాళ్లు, వేళ్ళు మొక్కి కడుపులో తలపెట్టి బ్రతిమిలాడి స్థానికులు ఓట్లు వేస్తే గెలిచిన కార్పొరేటర్ లే కొందరు వారి వారి వార్డుల్లో నూతన గృహ నిర్మాణ దారుల వద్ద లక్షల్లో వసూళ్లకు పాల్పడుతుంటే కార్పొరేటర్లను నిలదీయని విసురులు… విలేకరులపై ఎందుకూ…?
లక్షలు జీతాలు పొందే అధికారులకు ముడుపుల మూటలా…? జీతభత్యాలు లేని విలేకరులపై విమర్శల తూటలా…?
లక్షల్లో ప్రభుత్వం ఇచ్చే జీతాలు పొందుతూ విధులు నిర్వహించే అధికారులు గృహ నిర్మాణాలకు అనుమతులు లేవంటూ తొలుత నిర్మాణాలను కూల్చివేస్తామంటూ బెదిరింపులకు గురి చేయగానే అధికారుల అసిస్టెంట్స్ మధ్యవర్తిత్వంతో లక్షల్లో లంచాలు గుంజుతు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులకు తొత్తులుగా వ్యవహరించడమే తప్ప పోరాడితే పోయేదేముంది అనే ఉద్యమ స్ఫూర్తితో అధికారులు అక్రమ మార్గంలో దొడ్డి దారిన దోపిడీకి పాల్పడుతున్న తెరచాటు వ్యవహారాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అధికారుల అక్రమాల వికృత రూపాన్ని బహిర్గతం చేసి జవహర్ నగర్ ప్రాంతంలో గృహ నిర్మాణాలకు అనుమతులు లేకపోవడం వల్లే మున్సిపాలిటీ ఆదాయానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని.. అధికారులు దళారీలు దోపిడి తతంగానికి కారణమవుతుందని.. *అధికారులు అక్రమాలకు తావివ్వని ఎడల, అనుమతులు లేకుండా వందలాది భవన నిర్మాణాలు ఏదేచ్ఛగా ఎలా నిర్మాణం అవుతున్నాయని..* *నిలదీసే దిశగా అడుగులు వేస్తూ ఈ అక్రమాలకు అన్నిటికి గృహ నిర్మాణాల పర్మిషన్ ఇచ్చే వెసులుబాటు కల్పించడమే పరిష్కారమని.* మాజీ మంత్రి నేటి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ లను నిలదీస్తూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగలేక… విలేకరులపై విసురులెందుకూ…?
విలేకరులమంతా ఏకమై ఏకతాటిపైకి వచ్చి వార్తలు రాస్తాం… అక్రమార్కులు అధికారులు స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఆట కట్టిస్తాం…
ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణాల ఆట కట్టిస్తాం చట్టానికి సవాల్ విసురుతు ఆడిందే ఆట పాడిందే పాటగా విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యవహారం నెగ్గు తేలుస్తాం… ప్రొసీడింగులు జారీ చేయబడి నిత్యం స్వలాభం కోసం పాకులాడే స్వార్థపూరిత రాజకీయ నాయకుల కుట్రలు కుతంత్రాలతో నిర్మాణాలకు నోచుకోని వ్యవహారాలను వెలికి తీస్తాం… లక్షలు వెదజల్లి కోట్ల విలువ చేసే స్థలాలను కబ్జా చేసి అమాయక ప్రజలకు ప్లాట్లుగా విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న అక్రమార్కుల ఆగడాలకు ముక్కుతాడు వేస్తాం… జర్నలిస్టులు అంటే ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే వారదులు అని నిరూపిస్తాం సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తాం.