POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:48 pm Posted by : POLITICAL POWER

విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

– విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాలలో 2009 – 2010 లో బ్యాచ్ పూర్వ విద్యార్థులు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు09.2026.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాలలో 2009 – 2010 లో  పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, నవ సమాజానికి బాసటగా నిలుస్తున్నారు.ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడ్డ ఎవరికి వారు ఒకసారి సమ్మేళనానికి కలవడమే గగణమైన ఈ రోజుల్లో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని మంచి చెడులు బాగోగులు చర్చించుకుని ప్రతీసారి ఒకమంచి కార్యానికి నాందీ పలుకుతూ సమాజానికిమముసైతంఅంటూముందుకువెళుతున్నా 2009 – 2010 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంఎంతోవైభవంగాజరుపుకున్నారు. శనివారం కోత్తకోట పురపాలక కేంద్రంలోని విశ్వశాంతి విద్యానికేతన్   పాఠశాల ఆవరణలో 2009– 2010  ఎన్నికైన సంవత్సరం పూర్వ విద్యార్థుల బ్యాచి అందరూ కలుసుకొని ఒకరికొకరుసంభాషించు కొని ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. వారి మిత్రులతో ఎవరైనా ఇబ్బందులతో ఉన్నారని తెలిస్తే చాలు వారికి ఆసరాగా నిలుస్తూ వారి కుటుంబాలకు భరోసాకల్పించుకుందామనిచర్చించుకున్నారు.అనంతరంఈసందర్భంగా గురువులచే కేక్ కట్ చేయించారు. తమకు విద్యా, బుద్దులు నేర్పి తమ ఉన్నతికి దోహదపడిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుందర్, ఆంజనేయులు, రాములు, శేఖర్, హఫీజ్, బిందురాణి, గుల్షాద్ బేగం,  పావని, పూర్వ విద్యార్థులు విష్ణు, జయసింహ, శ్రీకాంత్, స్వాతి,  సంధ్య, తదితరులు పాల్గొన్నారు.