POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 1:30 pm Posted by : POLITICAL POWER

విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 23:

 

తూర్పుగోదావరిజిల్లా       బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో మానవతా ఆరోగ్య కేంద్రం వారిచే ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన హోమియో వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందిస్తున్నారు.
జలుబు, దగ్గు, జ్వరాలు, కీళ్ల నొప్పులు, అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు తదితర అనేక వ్యాధులకు వైద్య సలహాలు మరియు చికిత్స అందిస్తున్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
సేవే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని గ్రామ పెద్దలు, యువత మరియు భక్తులు అభినందిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగాలని కోరుతున్నారు.