POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 10:35 pm Posted by : POLITICAL POWER

వి. బి. జి. గ్రామ్ చట్టాన్ని రద్దు చేయాలి … ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం మండల నాయకులు.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్9టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోవడం యాత్రికరణ పెరగడంతో గ్రామీణ పేదలకు పనులు తగ్గిపోతున్నాయి. తమ ఆదాయం కంటే ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతున్నారని ఎం.పీ.డి.ఓ. ఆఫీస్ ముందు ధర్నా చేసి అర్జీ అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, కారు. లాజరస్ మండల అధ్యక్షుడు ,కారు ఎజ్రా ,జిల్లా ఉపాధ్యక్షుడు సగిలి. గురయ్య మాట్లాడుతూ ,విధి లేని స్థితిలో పేదల పొట్ట పట్టుకొని పోతున్నారు .ఈ స్థితిలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు ఉంది కేంద్ర ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దుచేసి కొత్తగా తెచ్చిన వి బి జి గ్రామ్ పథకం పేదల పొట్ట కొట్టేలా ఉంది. గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని మార్చి 125 లో రోజులకు పెంచామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం రోజులు పెంచింది కానీ భారీగా పెంచలేదు గత చట్టంలో ఉన్న గ్యారెంటీని రద్దు చేసింది .ఎప్పుడు పని అని అడుగుతే స్థానంలో రెండు నెలల పనికి ప్రకటించింది.గతంలో మ్యానువల్ గా మాస్టర్ వేసే స్థానంలో ఫేస్ యాప్ తెచ్చారు .దీనివల్ల కొన్నిచోట్ల నెట్టు సౌకర్యం లేక గంటల తరబడి హాజపడకపని ప్రదేశా నుండి ఉసురు మంటూ ఇంటికి వస్తున్నారు.తక్షణమే దీనిని రద్దుచేసి అడిగిన ప్రతి పేదవారికి పని కల్పించాలని, పాత చట్టాన్ని పునర్ది నుంచి ఉపాధి పనిలో ఇచ్చిన ప్రోత్సాహాలు కల్పించాలని వారు అన్నారు. వేసవికాలంలో నేల గట్టిగా ఉండి గడ్డపార భూమిలో దిగదు అందుగ్గాను గతంలో సమ్మర్ అల్వెన్స్ ఇచ్చారు. దాని కొనసాగించే చర్యలు తీసుకోవాలని అలాగే కొన్నిసంవత్సరాల తరబడి పనిముట్లు ఇవ్వడం లేదు. టెంట్లు, ప్లే స్లిప్పులు, లేవు. మజ్జిగ ఇచ్చే అమౌంటు లేదు ఐదు కిలోమీటర్లు దాటితే ఆటో ఛార్జీలు ఇచ్చేవారు ఇవి అన్ని పునరుద్ధరించాలని అన్నారు. పాల్గొన్నవారు వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు గుడిమే. సుదర్శన్, కారు నత్తనేలు బాబు, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు, షేక్ హుస్సేన్ పీరా, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు