POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 12:50 am Posted by : POLITICAL POWER

వెలుగులోకి వస్తున్న వాస్తవాలు – బెంగళూరులోతన నివాసాన్ని వైయస్.షర్మిళ కుమార్తె పెళ్లికి ఇవ్వలేదంటూ ఎల్లోమీడియా వార్తలపై వైయస్సార్‌సీపీ నాయకుల గుర్రు

 

ఈ విషయలో వైయస్.షర్మిళకు జగన్‌ రాసిన లేఖను ఉటంకిస్తున్న నేతలు

 

– ఆ లేఖలోని అంశాలే వాస్తవాలకు అద్దంపడుతున్నాయన్న నేతలు

– ఈ విషయాలపై మాట్లాడేందుకు తమకు ఇష్టం లేదంటున్న నేతలు

– అయినా తమ నాయుకుడిపై వ్యక్తిత్వ హననం దృష్ట్యా స్పందించాల్సి వస్తోందని ఆవేదన

– భద్రతా కారణాల రీత్యా అక్కడ వద్దని ముందే జగన్‌గారు చెప్పారన్న నేతలు

– జగన్‌ అభ్యంతరాలను షర్మిలపక్కనపెట్టి మరీ అక్కడే పెళ్లివేదిక అంటూ కార్డులు ప్రింట్‌చేశారంటున్న నేతలు

– ఇవాళ ఎల్లోమీడియాలో వార్తల తర్వాతనే అసలు ఏంజరిగిందనేదానిపై తమకు తెలిసిందంటున్న నేతలు

– వైయస్సార్‌సీపీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వైయస్‌.జగన్‌ రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇవి.

– అంజలి పెళ్లి గురించి తెలిసి చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ, ఆమె జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

– నా అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని నా నివాసంలోనే అంజలి పెళ్లి నిర్వహించాలని నువ్వు ఇప్పటికీ భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.

– నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి.

– ఈ భద్రతాపరమైన ఆందోళనలను ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశాను.

– పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్ సిబ్బంది, పూల అలంకరణ బృందాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, అతిథులు సహా ఎంతోమంది నివాస ప్రాంగణంలోకి వస్తారు.

– వీరిలో చాలామంది మనకు కనీస పరిచయం కూడా లేని వ్యక్తులే. ఇంతమంది వ్యక్తులు నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం భద్రతాపరమైన ముప్పులకు దారితీస్తుంది.

– నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వెళ్లి ప్రచారంలోకి రావడం తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలను సృష్టిస్తుంది.

– ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాదు. అంజలి చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.

– అయినప్పటికీ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను.

– నా కుమార్తులు Harsha లేదా Varsha పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని.

– ప్రస్తుతం నేను బెంగళూరు నివాసంలోనే ఉంటున్నాను. ఇక్కడ పెళ్లి వంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది. భద్రతాపరమైన ఆందోళనలు కూడా తలెత్తుతాయి.

– నా కుటుంబం సురక్షితంగా ఉండేలా నేను చూసుకోవాలనుకుంటున్నాను.

– వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు సంబంధించిన తీవ్రమైన ముప్పులను వివిధ వ్యక్తుల ద్వారా తెలియజేసినప్పటికీ, నా అభ్యంతరాలను, ఆందోళనలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నన్ను బాధించింది.

– ఈ విషయంలో నా పరిస్థితిని మరోసారి పరిగణనలోకి తీసుకుని, అంజలి పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను.

– రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చు.

– ఆ వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని నా Lotus Pondలో ఉన్న నా ఇంటిని పెళ్లి కోసం ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాను. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది.

– అంజలి పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని, భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

– అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను.

– అయితే, ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని, భద్రతాపరమైన ఆందోళనలను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.