పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: పెద్దమందడి పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన దయ్యాల బుచ్చమ్మ అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్టూరు గ్రామానికి చేరుకుని బుచ్చమ్మ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… బుచ్చమ్మ మృతి వార్తను నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన ప్రతిసారి ఆమెను ఆప్యాయంగా పలకరించేవాడినని, ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. వెల్టూరు గ్రామ సర్పంచ్ అశోక్ కుమార్, గద్వాల కృష్ణ, ఇతర ప్రముఖ నాయకులు తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మండల ఉపాధ్యక్షుడు ఆర్. జగదీశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుర్వ బాలచంద్రయ్య, ఉప్పరి రామ్ చంద్రయ్య, ఘన్పూర్–పెద్దమందడి మార్కెట్ డైరెక్టర్ దిండు రవి, జి.ఎల్. అనంతరెడ్డి, డి. వివేక్ సాగర్, వడ్డే శేఖర్, మిల్లర్ రాజు, జి. ప్రేమ్ సాగర్, డీలర్ శ్రీను, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.