చింతల వెంకటేశ్వర్లు ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి మండలం, వెలటూర్ గ్రామం లో, నేడు గ్రామ ప్రజలందరు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా గ్రామస్తులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గ్రామ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ & మాజీ ఎంపీటీసీ చింతల. వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో గ్రామ పూర్వీకులు ప్రతి సంవత్సరం ముక్కార్తి అర్ధ భాగం నాడు, ప్రతి ఇంటిలో ముందుగానే పోచమ్మ అమ్మవారి బోనాల కోసం సాహిత్యం అందిస్తూ, ప్రతి ఇంటి ఆనవాయితీగా అమ్మవారి సన్నిధిలో ఆశిస్సులు అందుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం చెరువుల నుండి వ్యవసాయానికి అనుకూలంగా, గ్రామములో ప్రజలు సుభిక్షంగా ఉంటూ, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని పోచమ్మ అమ్మవారి దీవెనలు గ్రామ ప్రజలపై ఉండాలని పేర్కొన్నారు. నేడు గ్రామంలో బోనాల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా, గ్రామానికి విచ్చేస్తున్న ఆడపడుచులకు, బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆహ్వానిస్తున్నామని, గ్రామస్తులందరి పైన అమ్మ వారి ఆశీస్సులు, ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఈ పండుగ వేళ మీ జీవితంలో ఆనంద శ్రేయస్సు మరియు, శాంతిని తీసుకురావాలని ఆశీస్తు..బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని సి.వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేశారు.