పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం వెల్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్టూరు ప్రాంగణంలో విద్యార్థులకు ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన స్కూల్ యూనిఫామ్‌లను అందజేశారు. గ్రామ సర్పంచ్ అశోక్ మరియు ఏఏపీసీ చైర్‌పర్సన్ నందిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన యూనిఫామ్‌లను అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ఆహుతులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… భవిష్యత్తులో విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య, మాజీ సర్పంచ్ బాల చంద్రయ్య, గొర్రె వెంకటయ్య, నరాల ఆంజనేయులు, సుంకరి బుస్సయ్య తదితరులు పాల్గొన్నారు.