POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 4:59 pm Posted by : POLITICAL POWER

వెల్టూరు ప్రభుత్వ పాఠశాలకు రూ.11.75 కోట్ల నిధులు

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం – కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: పెద్దమందడి మండలం వెల్టూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.75 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. డిఎస్ మహేష్ మాట్లాడుతూ… వెల్టూరు ప్రభుత్వ పాఠశాలను అన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఒకే ప్రాంగణంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించే విధంగా పాఠశాలను తీర్చిదిద్దనున్నారని చెప్పారు. అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానం, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి G.O.164 ద్వారా పాలనాపరమైన అనుమతులు లభించాయని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని డి. మహేష్ అన్నారు. వెల్టూరు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.11.75 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎంపీ మల్లు రవి లకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.