
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 28 2026: పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు ఎన్టీఆర్ మారుపేరుగా నిలిచారని పేర్కొన్నారు.సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దయల రమేష్, మెరుగు కుర్మయ్య, ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.