మొత్తం అరెస్టుల సంఖ్య 15కు చేరినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడింపు.
నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం.
పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 05 2026: ఖమ్మం జిల్లా వేంసూరులో పోలీసులు మరో ముగ్గురు డెకాయిట్ నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి అరెస్టుతో డెకాయిట్ ముఠాకు చెందిన మొత్తం అరెస్టుల సంఖ్య 15కు చేరింది. ఈ మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ఐపీఎస్) ప్రెస్ నోట్ విడుదల చేశారు. జూలై 2న దారిదోపిడీకి పాల్పడి లక్షల రూపాయలు కాజేసిన డెకాయిట్ ముఠాకు చెందిన 12 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ముఠా జూన్ 24న వేంసూరులో జరిగిన దోపిడీ ఘటనలో కూడా పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు దర్యాప్తు కొనసాగింపులో భాగంగా నిన్న మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,50,000 నగదు, సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.