POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:44 pm Posted by : POLITICAL POWER

వేముల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్, వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ జూన్ 24 2026: వైఎస్సార్ కడప జిల్లా వేముల మండలంలోని యూసియల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన వంశీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో సైదాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.