వేముల వెంకట్రావును పరామర్శించిన చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

విజయవాడ (చిట్టినగర్): పొలిటికల్ పవర్ ప్రతినిధి విజయవాడ చిట్టినగర్ నివాసి, బీసీ నాయకులు మరియు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు అయిన వేముల వెంకట్రావు గారు ఇటీవల మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ నేరుగా వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకట్రావు గారిని ఆప్యాయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.