POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 10:36 pm Posted by : POLITICAL POWER

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధి

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జెడ్పీటీసీ సభ్యునిగా ఇటీవల పోటీ చేసి, ఈ నెల 7వ తేదీన వెలువడిన ఫలితాల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పల వెంకట కృష్ణారెడ్డి ఈరోజు జయంతి గ్రామం నుండి జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు.

విజయం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమలాపురం బాలాజీ భవన్‌లో ఎర్రుపాలెం మండల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.