విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
![]()
పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్డులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.

