గ్రూప్ నుంచి రూ.50 వేలు, జై కృష్ణ వ్యక్తిగతంగా మరో రూ.10 వేలు అందజేత
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఈ నెల మనం సహాయం చేస్తున్న వంశీ కుమార్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.50 వేలును మన హీరో జై కృష్ణ చేత ఆదివారం రోజు విజయవాడలో అందజేశారు. మనం అందించిన రూ.50 వేలుకు జై కృష్ణ వ్యక్తిగతంగా మరో రూ.10 వేలు జోడించి మొత్తం రూ.60 వేలును అందజేశారు. తాతకు తగ్గ మనవడు, తండ్రిని మించిన తనయుడు, దానగుణంలో బాబాయిలా శ్రీమంతుడు అయిన జై కృష్ణకు మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన గ్రూప్ సభ్యులు చంటి, తాడి శివ, స్థానిక అభిమానులు లోల్ల కృష్ణ, మోహన్ కృష్ణ, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.