
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
ట్విట్టర్ స్పేస్ లో జనసేన మూక చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, టీ జే ఆర్ సుధాకర్ బాబు,లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, శైలజారెడ్డి ఇతర నేతలు హాజరు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ నేతలు.
సోషల్ మీడియా బూతులపై సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్, హోం మంత్రి అనిత మౌనమెందుకు?
డీజీపీ కార్యాలయానికి వెళ్తే సెలవుల సాకుతో ఎందుకు తప్పించుకుంటున్నారు.
వైయస్సార్సీపీ కార్యకర్తలపై మాత్రం అర్ధరాత్రి కూడా తప్పుడు కేసులా?
అసభ్య వ్యాఖ్యలపై చర్యలు లేకుంటే న్యాయపోరాటం చేస్తాం: వైయస్సార్సీపీ నేతలు స్పష్టీకరణ
మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దు..
మా సహనాన్ని పరీక్షించొద్దు.
హెచ్చరించిన వైయస్సార్సీపీ నేతలు.
వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా (ఎక్స్ స్పేస్) వేదికగా జనసేన కార్యకర్తలు చేసిన అత్యంత అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ సీనియర్ నాయకుల బృందం మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి 60 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, పార్టీ ప్యానలిస్టు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు పెన్ డ్రైవ్‌తో కూడిన ఆధారాలను అందజేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే..
వైయస్ జగన్ గారి ఆదేశాలతో మేము సంయమనం పాటిస్తుంటే.. మీ పార్టీ సైకోలు బూతులతో రెచ్చిపోతున్నారు:
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
ఆధారాలు ఇచ్చినా కేసు ఎందుకు పెట్టడం లేదు?:
జనసేన సైకోలు సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ అత్యంత జుగుప్సాకరమైన బూతులు మాట్లాడారు. దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. అదే వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అయితే ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకే కేసుపై రాష్ట్రమంతా ఊరూరా తిప్పి వేధిస్తున్నారు.
డీజీపీ ఆఫీసు పనితీరు ఇదేనా?:
స్వయానా డీజీపీ గారిని కలిసి ఆధారాలు ఇద్దామని వస్తే శనివారం హాలిడే అని, ఎవరూ అందుబాటులో ఉండరని చెబుతున్నారు. ఇదేనా డీజీపీ ఆఫీసు పనితీరు? మేము పెన్ డ్రైవ్‌తో కూడిన ఆధారాలను అక్కడి అధికారులకు ఇచ్చి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారని, అవసరమైతే భౌతికంగా లేకుండా చేస్తామని ఆ వీడియోల్లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడవద్దని మా నాయకుడు వైయస్ జగన్ గారు ఆదేశిస్తే మేమంతా సంయమనం పాటించాం. మరి మీ పార్టీ సైకోల వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం.
భారతమ్మ గారిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారికి కఠిన శిక్ష తప్పదు:
కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ
సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు:
మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, ఏనాడూ రాజకీయాల్లోకి రాని మా భారతమ్మ గారిపై 350 మందితో కూడిన ట్విట్టర్ స్పేస్‌లో జనసైకోలు అత్యంత నీచాతినీచంగా మాట్లాడారు. సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఉన్న ఆ వీడియోలను ఎవరూ చూడలేని పరిస్థితి ఉంది. మహిళలను గౌరవిస్తామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?”
పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?:
పవన్ కళ్యాణ్ గారి కుటుంబ విషయాలపై ఎవరూ మాట్లాడకూడదని మా నాయకుడు జగన్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కాబట్టే మేమంతా మౌనంగా ఉన్నాం. అదే మా నాయకుడు ఒక్క మాట చెప్పి ఉంటే మేము కూడా గట్టిగా సమాధానం చెప్పేవాళ్లం. మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితేనే తిప్పి తిప్పి అరెస్టులు చేస్తున్న పోలీసులు, ఇంత దారుణంగా మాట్లాడిన జనసేన సైకోలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారికి శిక్ష పడే వరకు మేము విడిచిపెట్టం.
మాకు ఫిర్యాదు చేయాలంటే సెలవులు..
మా కార్యకర్తలపై కేసులు పెట్టాలంటే అర్ధరాత్రి కూడా వర్కింగ్ డేనా?:
మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే
60 గంటలు గడిచినా ఎఫ్ఐఆర్ లేదు:
రాష్ట్రంలో ఒక ప్రముఖుడి విడాకుల వ్యవహారంపై ఎవరూ జోక్యం చేసుకోవద్దని జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు హుందాగా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ రోజు సాయంత్రమే జనసేనకు సంబంధించిన ఎక్స్ స్పేస్‌లో 350 మంది కలిసి ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ తలదించుకునే భాషలో మాట్లాడారు. దీనిపై ఫిర్యాదు చేసి 60 గంటలు గడిచినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
మూడేళ్లలో వందసార్లు వచ్చినా డీజీపీ కనపడలేదు:
ఈ మూడేళ్లలో మేము వందల సార్లు డీజీపీ కార్యాలయానికి వచ్చినా ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరు. మేము ఫిర్యాదు చేయడానికి వస్తే శుక్ర, శని, ఆదివారం సెలవు అని చెబుతున్నారు. అదే వైయస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటే మాత్రం అర్ధరాత్రి పూట కూడా పోలీసులకు వర్కింగ్ డే అవుతుంది. వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 800 కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఆ 350 మందిపై, ఆర్గనైజర్లపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే వివిధ ఫోరమ్స్‌లో న్యాయపోరాటం చేస్తాం.
వైయస్ జగన్ గారి సంయమనం ఇక్కడి నీచపు రాజకీయాలకు పనికిరాదు:
టీజేఆర్ సుధాకర్ బాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా?:
ఆంధ్ర రాష్ట్రంలో అసలు డీజీపీ ఉన్నారా? ఉంటే వైయస్సార్సీపీ నేతలను ఎందుకు కలవడం లేదు? మాజీ ముఖ్యమంత్రి భార్య, చెల్లెలు, తమ్ముడిపై జనసేనకు చెందిన 350 మంది సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న డీజీపీ, సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు మహిళల ఆత్మగౌరవ సంక్షోభం ఏర్పడింది.
జగన్ కుటుంబ మహిళలను దూషిస్తే చూస్తూ ఊరుకోలేం. పవన్ కళ్యాణ్ మూడో విడాకుల అంశం మాకు సంబంధం లేదని మా నాయకుడు చెబితే మేము నోరు మూసుకున్నాం. కానీ వైయస్ జగన్ గారి సంయమనం, సంస్కారం ఈ నీచపు రాజకీయాలకు పనికిరావు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయాలను వారి దారిలోనే ఎదుర్కోవాలి.
ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికే ఈ బూతు పురాణం:
మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
బూతులు మాట్లాడటానికి లైసెన్సులు తెచ్చుకున్నారా?:
గత రెండున్నరేళ్లుగా ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు బూతులు మాట్లాడటానికి, వ్యక్తిత్వ హననానికి ఏకంగా లైసెన్సులు తెచ్చుకున్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైయస్సార్సీపీ కార్యకర్తలపై వేల కేసులు పెట్టి, వందల రోజులు అక్రమ నిర్బంధంలో ఉంచుతున్నారు. వైజాగ్‌లో కేసు పెట్టి అనంతపురం వారిని, తిరుపతిలో కేసు పెట్టి విజయవాడ వారిని అరెస్టు చేస్తున్నారు. మేము వందల ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు కనీసం కేసు రిజిస్టర్ చేయడం లేదు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే కుట్ర పన్నారు. విద్యార్థులకు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, తుఫాను రైతుల నష్టపరిహారం, మహిళలపై అగాయిత్యాలపై వైయస్సార్సీపీ చేస్తున్న పోరాటాలను పక్కదోవ పట్టించడానికే కూటమి నేతలు ఇలాంటి బూతు పురాణాలను ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా కేసులు నమోదు చేయకపోతే కోర్టుల ద్వారా ముద్దాయిలకు శిక్ష పడే వరకు పోరాడుతాం.
అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలు కళ్లు తెరవాలి:
శైలజారెడ్డి, పార్టీ ప్యానలిస్టు
రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులు:
పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇబ్బంది తలెత్తితే పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడవద్దని మా అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు సంస్కారం చూపించారు. కానీ అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలు జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన సతీమణి, చెల్లెలు, కుటుంబ సభ్యులపై దారుణంగా మాట్లాడిస్తున్నారు. ఒక మహిళగా గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి సిగ్గుపడుతున్నాను. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోతే రాష్ట్ర ప్రజలే కూటమికి తగిన బుద్ధి చెబుతారు.