పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :/ వైరా నియోజవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరసోదరీమణులందరికీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలనే ప్రేమ, బాధ్యతలకు ప్రతీక అని అన్నారు. మన కుటుంబ బంధాలు మరింత బలపడాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆత్మీయత, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలని కోరారు. వైరా నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.