POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 12:36 pm Posted by : POLITICAL POWER

వైసీపీ ప్రచారంలో దూకుడు.. జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత ర్యాలీ

 

ఆరు గ్రామాల్లో విస్తృత ప్రచారం.. భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యమంటున్న సుజాత

Oplus_16908288
Oplus_16908288

 

బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత వెంకటరామారెడ్డి ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. బిక్కవోలు, ఆర్‌.ఎస్‌.పేట, రంగాపురం, ఇళ్లపల్లి, తుమ్ములపల్లి, ఊలపల్లి గ్రామాల్లో భారీ ర్యాలీ చేపట్టారు.

ప్రచార రథంపై గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్‌ ర్యాలీతో ప్రచారంలో ఉత్సాహం ప్రదర్శించారు. ఆయా గ్రామాల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను కూడా పరిచయం చేస్తూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సుజాత ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా కొవ్వూరి సుజాత వెంకటరామారెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని ఎన్నికల ద్వారా తెలియజేయడానికి ప్రజలకు ఇది ఒక అవకాశమని పేర్కొంటూ, ప్రజల మద్దతుతో తమ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ అభ్యర్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.