అమ్మవారికి మొక్కులు చెల్లించిన వివిధ నాయకులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెబ్బేరు మండలం వై శాఖపూర్ గ్రామంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు బోనాలను సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో బీసీ పొలిటికల్ రాష్ట్ర కార్యదర్శి వి.వి. గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కే.ఎన్. డాక్టర్ నికిత, సామాజికవేత్త ఏబీవీ సత్యం సాగర్, మాజీ సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్, ఎం. రామకృష్ణ నాయుడు, మాజీ ఉప సర్పంచ్ సంద ఎల్లయ్య, తెలుగు తిరుపతయ్య, వార్డు నెంబర్ రామకృష్ణ, సింగరేణి వైస్ చైర్మన్ అంజి నాయుడు, జక్కుల శీను, ఉప సర్పంచ్ తిరుపతయ్య యాదవ్, బలరాం యాదవ్, కావలి గోవిందు నాయుడు, డీలర్ యాదవ్, తెలుగు గోపాల్, ఉప్పరి వెంకటయ్య, కురువ శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయజయధ్వానాలు, డప్పు వాయిద్యాలతో వై శాఖపూర్ గ్రామం సందడిగా మారింది.