POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 10:17 pm Posted by : POLITICAL POWER

వ్యక్తిగత దూషణలు చేయడం మానుకోండి వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 24 2026: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డిల పై వ్యక్తిగత దూషణలు చేయడం మానుకోవాలని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి జిల్లా బిఆర్ఎస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన అనుచరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డిలపై లేనిపోని ఆరోపణలను దూషించడం సబబు కాదని దీనిని తక్షణమే విరమించుకోవాలని బి ఆర్ ఎస్ నాయకులను హెచ్చరించారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయడం సబబు కాదని చిల్లర మల్లర ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శిస్తే అంతకన్నా ఎక్కువ విమర్శించే స్థాయి ఉన్న ప్రజాస్వామ్యంలో మాట్లాడడం మంచిది కాదని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన మాజీ మంత్రి అవినీతి బండారాన్ని ఒక్కొక్కటి బయటికి తీస్తామని అన్నారు. ఆస్తులు సంపాదించిన నిరంజన్ రెడ్డి తన అనుచరులు చెక్కభజనలు చేస్తూ ఓడిపోయిన నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడితే వనపర్తి ప్రజానీకం ఎంతో తెలివైన వారని మేధావులని ఆలోచించే స్వభావం గల ప్రజలు ఉన్నారని చెప్పారు. మీరు విమర్శించే ముందు ఆలోచించాలని కోరారు. అవినీతి అక్రమాలు చేసినందునే 2023లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఇంటికి పంపించారని మీకు ఇప్పటికైనా ఆ సోయి లేదన్నారు. నిరంజన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో అవినీతి అక్రమాలు ఫామ్ హౌస్ లు నిర్మించుకోవడం అవినీతి డబ్బుతో స్విస్ బ్యాంకులో అకౌంట్స్ నిర్వహిస్తున్న మీరు గతంలో ఎన్నోసార్లు విదేశీ పర్యటనలు చేసినా మేము విమర్శించలేదని మీరు మా ఎమ్మెల్యే పై లేనిపోని ఆరోపణలు చేయడం పట్ల ప్రజలు ఆలోచిస్తున్నారని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బిఆర్ఎస్ హయాంలో ఘనపసముద్రం భూములు కోల్పోయిన బాధితులకు ఐదు లక్షలపై పరిహారం ఇప్పించారని అదే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు 18 లక్షలు పరిహారం ఇచ్చిన ఇక్కడి రైతులను మోసం చేశారని గుర్తు చేశారు పరిహారం ఇప్పించడంలో రైతులను మోసం చేసిన నిరంజన్ రెడ్డి గణపసముద్రం రిజర్వాయర్ ను ఇక్కడి రైతులు వద్దన్నా కమిషన్ల కోసం కక్కుర్తి పడి రిజర్వాయర్లు చేపట్టారని ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నిరంజన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా 35 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో పలువురు ఎమ్మెల్యేలు కమిషన్లకు కక్కుర్తి పడ్డారని పాలమూరు రైతాంగాన్ని చుక్క నీరు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు పార్టీ సీనియర్ నాయకులు బి కృష్ణ బ్రహ్మం కోళ్ల వెంకటేష్ కౌన్సిలర్ పరుశురాం తదితరులు ఉన్నారు.