పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: ఆదివారం తన వ్యవసాయ పొలంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఓవైపు ఎమ్మెల్యేగా సమర్థవంతమైన పాలన చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు వ్యవసాయంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం తన వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ చేపడుతున్న వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఆయిల్ పామ్ సాగు ఏర్పాటు చేయనున్న పొలాన్ని పరిశీలించి, భూసార పరిస్థితులు, సాగుకు అనుకూలత, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. అనంతరం ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవుల వద్దకు వెళ్లి స్వయంగా అరటిపండ్లు తినిపించారు. వాటి ఆరోగ్య పరిస్థితి, పోషకాహారం, సంరక్షణ విధానాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పశువుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సమయానికి మేత, పోషకాహారం, తాగునీరు, వైద్య పరీక్షలు అందేలా చూడాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రంలో ప్రతి పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, పశువుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.