పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ సత్యప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభుని గూడెం గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్లుగా (MPW) పనిచేస్తున్న ఉద్యోగులపై సర్పంచ్ శివ తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నట్లు వార్త వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ మోపుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక MPW ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత నెల 18వ తేదీ నాటికే వారి పని భారం ముగిసినప్పటికీ, వారిపై ఇంకా ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌గా ముగ్గురు వ్యక్తులను పెట్టుకుని, శంభుని గూడెం పంచాయతీ నిధులను సర్పంచ్ శివ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్థానికులు మరియు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
MPW వర్కర్లపై సర్పంచ్ శివ వేధింపులు.. పంచాయతీ నిధుల దుర్వినియోగం! సంబంధిత శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి పంచాయతీకి గ్రామ ప్రజలకు సరైన న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు