శాకాంబరి మాతగా శ్రీ అంబాభవాని మాత అలంకరణ దర్శనం
– 101 రకాల పిండి వంటలతో అమ్మవారికి విశేష నైవేద్యం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు01.2026. కొత్తకోట పట్టణంలోని శ్రీ అంబాభవాని దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారిని శాకాంబరి మాతగా రకరకాల కాయగూరలు , ఆకుకూరలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు,అభిషేకాలుఘనంగానిర్వహించారు.పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి 101 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మఠం సదాశివయ్య...