POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 7:47 pm Posted by : POLITICAL POWER

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన జవహర్ నగర్ తొలి మేయర్: మేకల కావ్య.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

కీసర సర్కిల్ : జవహర్ నగర్: జవహర్ నగర్ డివిజన్ నోబుల్ స్కూల్ పరిధిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రులు కేటీఆర్ మరియు చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా డివిజన్ పరిధిలోని పలు రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఇట్టి శిలాఫలకాన్ని కొంతమంది వ్యక్తులు కావాలనే దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రజా ఆస్తికి సంబంధించిన ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం అత్యంత విచారకరం. ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన గుర్తులను ఈ విధంగా ధ్వంసం చేయడం జరిగింది.

ఇట్టి విషయంపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ని కలిసి జరిగిన ఘటనను గురించి వివరించిన జవహర్ నగర్ తొలి మేయర్ మేకల కావ్య ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు తక్షణమే శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే విచారణ జరిపించి, బాధ్యులైన వ్యక్తులను గుర్తించాలి.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.

ధ్వంసం చేయబడిన శిలాఫలకాన్ని గతంలో ఉన్న అసలు ప్రదేశంలోనే తిరిగి తక్షణమే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐని కలిసి జరిగిన ఘటనను వివరించి, ఫిర్యాదు చేయడం జరిగింది. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలను తీసుకోగలరని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్, మాజీ కోఆప్షన్ నెంబర్, జిల్లా స్థాయి నాయకులు మరియు స్థానిక బిఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.