“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”
పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. తొలుత అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఇటుకల హరిబాబు, ప్రియాంక దంపతుల కుమార్తెలు హిమవర్షిణి, రితువర్షిణిల ఓణీల అలంకరణ వేడుక పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి హాజరైన సోయం వీరభద్రం చిన్నారులను ఆశీర్వదించి వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.అనంతరం అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ వార్డు సభ్యుడు రాంబాబు కుటుంబానికి చెందిన ఆళ్ళ...