POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 5:49 pm Posted by : POLITICAL POWER

శుభకార్యక్రమములో మొక్కను నాటుదాము – ప్రకృతిలో పచ్చదనము పెంచుదాము -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: నపర్తి మండలంలోని తిరుమలయ్య గట్టు రేడియంట్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే శుభకార్యక్రమాలలో మొక్కను నాటడం ఒక సంప్రదాయంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ సందర్భాలలో మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. చెట్లు లేకుంటే మానవ మనుగడే లేదని, చెట్లు మనకు ప్రాణవాయువు, నీడ, పండ్లు, కలపను అందిస్తాయని తెలిపారు. నేడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే విరివిగా మొక్కలు నాటడమే ఏకైక మార్గమని సూచించారు. విద్యార్థులు చిన్న వయసు నుండే ప్రకృతిని ప్రేమించడం, మొక్కలను సంరక్షించడం అలవాటు చేసుకోవాలని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాని బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రకృతిలో పచ్చదనం పెరిగితేనే భూగర్భ జలాలు పెరుగుతాయని, వర్షాలు సకాలంలో కురుస్తాయని, రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్కూల్ డైరెక్టర్ కౌసల్య భాస్కర్, ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ బి.రాము, ఎకో క్లబ్ కన్వీనర్ శృతి, ఉపాధ్యాయులు రాహుల్,,శాంతయ్య, శ్రీనివాస్, అఖిల్, పిఈటి వెంకటేష్ ,మల్లేష్, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీతా, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సాహితీ కళా వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.