శేరిపురం రైతు వేదికలో ఘనంగా వ్యవసాయ అవగాహన సదస్సు — రసాయనాలు తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి: ఏవో కావటి రామారావు — జీవామృతం, ఘనజీవామృతం తయారీపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ
గార్ల (పొలిటికల్ పవర్ - మాలోత్ అజయ్ నాయక్): గార్ల మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ప్రత్యేక వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుగులోత్ భారతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి (ఏవో) కావటి రామారావు హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెరగడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించవచ్చని...