*శ్రావణ పౌర్ణమి వేళ ఘనంగా సామూహిక కుంకుమ పూజ*

సంతోషిమాత సహిత అయ్యప్పస్వామి వారి ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు   బిక్కవోలు ఆగష్టు:28 తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం శ్రావణ శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా బలభద్రపురంలోని శ్రీ సంతోషిమాత సహిత అయ్యప్పస్వామి వారి ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సబ్బేళ్ళ రామారెడ్డి (గురుస్వామి) పర్యవేక్షణలో, ఆలయ నిర్వాహకులు కామేష్ శర్మ, సుమంత్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి...