POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 2:46 pm Posted by : POLITICAL POWER

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గోపికల వేషధారణలో చిన్నారుల సందడి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన చిన్నారులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపికల వేషధారణలో అలరించారు. వాకిటి మేఘన, వాకిటి సౌమ్యశ్రీ, వాకిటి చరిత తదితర చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకట పద్మ రాయల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఈ వేషధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు అందమైన గోపికల వేషధారణ చేయించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ కావలి రఘు మరియు ఉపాధ్యాయ బృందం సమన్వయంతో నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణుడి బాల్య లీలలు, గోపికల భక్తి భావాలను ప్రతిబింబించేలా వేషధారణతో ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులైన మాజీ వార్డు మెంబర్ వాకిటి సరిత–పరశురామ్, వాకిటి సంధ్య–రామస్వామి దంపతులను ప్రిన్సిపల్ కావలి రఘు ప్రత్యేకంగా అభినందించారు. పిల్లల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగల పట్ల అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆనందోత్సాహాలను నింపింది.