POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 1:54 pm Posted by : POLITICAL POWER

శ్రీశైలంలో బయలువీరభద్రస్వామివారికి విశేష పూజలు

అమావాస్య సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.. భక్తులకు పరోక్ష సేవ అవకాశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 09 2026: శ్రీశైలం అమావాస్య ఘడియలను పురస్కరించుకుని శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామివారికి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం సాయంకాలం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి ఈ విశేషార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమావాస్య సందర్భంగా భక్తులు సైతం పరోక్ష సేవ రూపంలో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహాగణపతి పూజ నిర్వహిస్తారు. అనంతరం పంచామృతాలతో పాటు బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. శ్రీ బయలువీరభద్రస్వామివారి ఆరాధనతో గ్రహదోషాలు తొలగిపోతాయని, అరిష్టాలు నివారించబడతాయని, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నుంచి రక్షణ కలగడంతో పాటు సర్వకార్యానుకూలత, అభీష్టసిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.