ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

* శ్రీశైలం దేవస్థానంలోని కార్తిక మాసం సందర్భంగా* *పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు*

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 27( పొలిటికల్ పవర్ న్యూస్ )
• నవంబరు 10వ తేది నుంచి డిసెంబరు 9 వరకు కార్తిక మాసోత్సవాలు
• కార్తిక మాసోత్సవాలలో పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు
• కేవలం రూ. 216/-ల రుసుముతో ఆర్జిత అభిషేకాలకు అవకాశం
• మనమిత్ర వాట్సప్ లేదా ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో టికెట్లు

కార్తిక మాసోత్సవాల సందర్భంగా పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు తెలిపారు.
నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. భక్తులరద్దీ కారణంగా గతంలో వలనే ఈ సంవత్సరం కూడా ఈ కార్తిక మాసోత్సవాలలో ప్రధానాలయంలో నిర్వహించబడే శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేయడం జరిగిందన్నారు.
కాగా శ్రీశైలమహాక్షేత్రంలో కార్తిక మాసం సందర్భంగా భక్తులు పరమేశ్వరునికి అభిషేకాలను జరిపించుకునేందుకు వీలుగా పంచమఠాలలో ఆర్జిత అభిషేకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులు ఈ అభిషేకాన్ని జరిపించుకునేందుకు వీలుగా కేవలం రూ. 216లను మాత్రమే రుసుముగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక టికెట్ పై దంపతులు లేదా ఒకరిని అభిషేకానికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ ఆర్జిత అభిషేక టికెట్లను మనమిత్ర వాట్సాప్‌ నెంబరు 9552300009 మరియు ఏ.పి.టి.ఎస్ వారి వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చునని అన్నారు.
భక్తులు వారి అభీష్టం మేరకు పంచమఠాలుగా ప్రసిద్ధమైన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠాలలోని ఏదైనా ఒక మఠంలో ఈ ఆర్జిత అభిషేకాన్ని జరిపించుకోవచ్చునని వారు తెలియజేశారు.

ఇంకా వారు మాట్లాడుతూ శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు ఈ పంచమఠాలు ప్రధానపాత్ర పోషించాయన్నారు. వ్యవహరంలో ఇవి మఠాలుగా పిలువబడుతున్నప్పటికీ ఈ అయిదు కూడా గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి ఆలయ లక్షణాలు కలిగివుండడం ఎంతో విశేషమన్నారు.
కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా కూడా ప్రధాన భూమికను వహించాయన్నారు. ముఖ్యంగా ఈ పంచమఠాలు ధ్యానకేంద్రాలుగా ప్రసిద్ధమయ్యాయన్నారు.
కావున భక్తులు దేవస్థానం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్తికమాసంలో అభిషేకాలను జరిపించుకోవాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.

Latest Articles

పాతూరు కూరగాయల మార్కెట్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ రాక్షసత్వానికి బీటెక్ విద్యార్థి బలి!

  హైదరాబాద్ (పొలిటికల్ పవర్):రాజధాని నగరం హైదరాబాద్‌లో రోడ్లు యమపాశాలుగా మారుతున్నాయి. వేగంగా...

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై జన సంకల్ప యాత్ర: ఎం.పి. ఈటెల రాజేందర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

భుజాలెక్కిన సమస్యలు – అబ్బా కొడుకులకి బిగ్ షాక్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నయ్య క్షేత్రస్థాయిపోరు.. కూటమి సర్కార్‌కు సెగ తప్పదా?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. నిన్నటిదాకా...

రేవంత్ రెడ్డి ‘రివెంజ్’ పాలిటిక్స్? ఓటుకు నోటు ఫిర్యాదుదారుడిపై వేటు!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*  హైదరాబాద్తె  :లంగాణ రాజకీయం మరోసారి హీటెక్కింది. సంచలనం...

*శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఇది చీకటి రోజు!* *కూన రవికుమార్ వి దిగజారుడు రాజకీయాలు* 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*(శ్రీకాకుళం)ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే...
error: Content is protected !!