POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:14 pm Posted by : POLITICAL POWER

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

ఖమ్మం నగరంలోని 48వ డివిజన్ ఆటోనగర్‌లో శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి గణేష్ మండపాన్ని ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబా, ముఖ్య నాయకులు బాల గంగాధర్ తిలక్,పుచ్చకాయల వీరవధ్రం,శేఖర్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, డివిజన్ ఇంచార్జ్ అల్లె సాయికిరణ్, ఫోర్ వీలర్స్ మరియు ఆటో టెక్నీషియన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

– అనంతరం ముఖ్య అతిథులను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.