శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి, వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను.ఆదేశించారు.

// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి.భూపాలపల్లి // కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో మంగళవారం ఆయన రెవెన్యూ, పోలీస్, అటవీ, దేవాదాయ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్తు, ఆర్ డబ్ల్యూ ఎఎస్, ఆర్టీసీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని,...