పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బ్రహ్మంగారిమఠం, జూన్ 24 2026: బాపట్ల జిల్లా, చీరాల మండలం, పాటచీరాల గ్రామములో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహాగణపతి, ఈశ్వరదేవి, సిద్ధమూర్తి, నందీశ్వర, ధ్వజస్తంభం మరియు శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. స్వాముల వారి రాకతో ఆలయ కమిటీ వారు స్థానిక ప్రజలు భక్తులు ఘనంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, చరిత్ర గురించి వివరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈనెల 22, 2026 సోమవారం ప్రారంభమై జూన్ 24,2026 బుధవారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, వేదపారాయణాలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.దేవస్థాన అభివృద్ధికి సహకరించిన దాతలు,భక్తులు,గ్రామస్థులు మరియు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.