POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 6:47 am Posted by : POLITICAL POWER

శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ ఘటన పై కేసు నమోదు

అన్ని కోణాల్లో దర్యాప్తు – సీఐ జలంధర్ రెడ్డి

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,బోడుప్పల్ శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో జరిగిన విద్యార్థుల దాడి ఘటనలో కేసు నమోదు చేశామని మేడిపల్లి సీఐ డి.జలంధర్ రెడ్డి తెలిపారు. గాయపడిన విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

ఘటనకు బాధ్యులైన వారిపై సి ఆర్ నెంబర్ 1521/26s 126(2),115(2), 351(2) ఆర్/డబ్ల్యు 3(5) బి.ఎన్.స్.సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.