POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:03 pm Posted by : POLITICAL POWER

శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అమ్మవారి ఆశీస్సులు వనపర్తి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి

-ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కు నిర్వాహకులు, భక్తులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని కోరినట్లు తెలిపారు. అమ్మవారి దీవెనలు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, వనపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బి కృష్ణ, బ్రహ్మం చారి, చీర్ల సత్యం సాగర్, చుక్కరాజు, నందిమల్ల చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.