ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

*శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం*

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లాశ్రీశైలం నవంబర్ 5(పొలిటికల్ పవర్ న్యూస్)

లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ( 05.11.2026) ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.

కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.

ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడింది. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించబడ్డాయి.

వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతోంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని చెప్పబడుతోంది.

కాగా శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరోచేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.

 

Latest Articles

*మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత తాగునీరు జాతీయ మానవ హక్కుల కమిషనర్ మిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య* 

**పొలిటికల్ పవర్ న్యూస్ నాంపల్లి మండలం*భగీరథతో నల్గొండ జిల్లా, నాంపల్లి...

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కొరతపై ఏఆర్వో ఆగ్రహం

 కరస్పాడు కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్ 9...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు...

ఆదర్శ దంపతులు పగడాల పారిజాత-బాలరాజులకి 26వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

 మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్):ఆలుమగల అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, గ్రామంలో...

Related Articles

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కొరతపై ఏఆర్వో ఆగ్రహం

 కరస్పాడు కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ .ఎం. ప్రసాద్ రావు.కలస్పాడు వైఎస్ఆర్. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా....

error: Content is protected !!