POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 5:40 pm Posted by : POLITICAL POWER

శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి ₹ 2,51,116/- విరాళం అందజేసిన ఉమామహేశ్వర రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్,వనపర్తిజిల్లాబ్యూరోఆగస్టు20.2026.కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి కొత్తకోట పట్టణ వాస్తవ్యులు కీ.శే.కన్నారెడ్డి బుచ్చమ్మ కీ.శే.కన్నారెడ్డి కృష్ణారెడ్డి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వనపర్తి మునిసిపల్ అధికారి కన్నారెడ్డి పారిజాతమ్మ, కన్నారెడ్డి ఉమామహేశ్వర రెడ్డి దంపతులు వారి కుమారుడు భరత్ రెడ్డి 2,51,116/- ( రెండు లక్షల యాభై ఒక్కవేయ్యి నూట పదహారు రూపాయలు ) విరాళాన్ని ప్రకటించి అయ్యప్పసేవాసమితిఅధ్యక్షులు ధూపం నాగరాజు , పొగాకు అనీల్ కుమార్ , విశ్వనాథం గంగాధర్ , బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , భీమ కిషోర్ , కృష్ణాచారి , యాదిరెడ్డి గారికి అందజేశారు .ఈ సందర్భగా ఆలయ కమిటీ వారి కుటుంభ సభ్యులను శాలువాతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.