
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్
ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య బయ్యారం మండలం సంతులాల్ బోడు తండా అభివృద్ధికి సంబంధించి రెండు పనులకు 7.49 లక్షల నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ మంత్రులను కలిసి ఎమ్మెల్యే సిఫారసు లేఖను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మూల మధుకర్ రెడ్డి , బయ్యారం సింగిల్ విండో డైరెక్టర్ చాగర్లముడి భాస్కర్ అందించారు. ఈ సందర్భంగా వారు నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని తో మాట్లాడుతూ బయ్యారం మండలం సంతులపోడు తండా సమీపంలోని అలిగేరు వాగుపై రూ.5.49 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణంతో వర్షపు నీటి నిల్వ పెరిగి, భూగర్భ జలాలు మెరుగుపడటంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని వివరించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ని కలిసి బయ్యారం మండలంలోని సంతులపోడు గ్రామపంచాయతీ పరిధిలో కోసూరు శ్రీను ఇంటి నుంచి యేటి వరకు రూ.2 కోట్ల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.