POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 8:19 pm Posted by : POLITICAL POWER

సతీషన్ సారథ్యంలోనే కేరళ అభివృద్ధి సాధ్యం

అభ్యర్థిగా సతీషన్ ఎంపిక గొప్ప నిర్ణయం

14 ఏళ్ల క్రితమే మేమిద్దరం తమిళనాడులో ఏఐసిసి ఇన్చార్జిలుగా పనిచేశాం

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్  

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 15 2026: కాబోయే ముఖ్యమంత్రి వీ.డి. సతీషన్ సారథ్యంలో కేరళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సతీషన్ పేరును ఏఐసీసీ ప్రకటించడం గొప్ప విషయమని చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎల్పీ లీడర్ గా ప్రతిపక్షంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన సతీషన్ పరావర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని చిన్నారెడ్డి తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి హోదాలో సతీషన్, నేను తమిళనాడు రాష్ట్రంలో సౌత్, నార్త్ ప్రాంతాల ఇన్చార్జిలుగా 2012 నుంచి 2015 వరకు కలిసి బాధ్యతలు నిర్వహించామని చిన్నారెడ్డి గుర్తు చేశారు. కేరళ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం చైర్మన్ గా, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, ప్రదేశ్ కాంగ్రెస్ లలో సతీషన్ పలు బాధ్యతలు నిర్వహించారని, హైకోర్టు న్యాయవాదిగా రాణించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, కేరళ సీఎం అభ్యర్థి సతీషన్ లకు చిన్నారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.