కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్న నాయకుడు: ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 19 2026: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగామయీ దయానంద్ పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ… దేశ ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువల కాపాడటంలో రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఆయన నాయకత్వం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.