సనాతన ధర్మం పేరిట ప్రచారం. హిందూ అమ్మాయిల మీద అఘాయిత్యాలు. బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి. రేవంత్, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బాధిత కుటుంబం బలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి.
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: యావత్తు తెలంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డది అని రాష్ట్ర బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం రోజు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలసి వారి స్వగృహంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణను కుదిపేసిన ఫోక్సో...