POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 7:20 am Posted by : POLITICAL POWER

సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజానాయకుడు – వైఎస్ అవినాష్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక & పొలిటికల్ న్యూస్ 9 తెలుగు టీవీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో : యర్ర నాగరాజు రెడ్డి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే సంకల్పం, దానికి అనుగుణంగా కృషి చేసే నాయకత్వం ఉంటే ఎలాంటి సమస్యకైనా మార్గం కనుగొనవచ్చని గౌరవ పార్లమెంట్ సభ్యులు వై ఎస్ అవినాష్ రెడ్డి నిరూపించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, వారి దాహార్తిని తీర్చిన ఘనత ఆయనకు దక్కిందని స్థానికులు పేర్కొంటున్నారు. నీటి సమస్యకు వినూత్న పరిష్కారంగా బోరుబావులను తవ్వించి, వాటిని కృత్రిమ రీఛార్జ్ విధానంతో నీటితో నింపే కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను అధిగమించే ప్రయత్నం చేశారు. ఈ చర్యతో అనేక కుటుంబాలు ఉపశమనం పొందినట్లు చెబుతున్నారు. నేటి రాజకీయాల్లో చిన్న పనికే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ధోరణి కనిపిస్తున్నప్పటికీ, అవినాష్ రెడ్డి మాత్రం చేసిన పనులను ప్రచారం చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండలేదని ఆయన అనుచరులు, ప్రజలు అంటున్నారు. అయితే ప్రజలకు జరిగిన మేలు గురించి తెలియజేయడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రైతులకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, వాటి గురించి ప్రచారం చేసుకోవడంలో ఆయన వెనుకబడి ఉన్నారనేది పలువురి అభిప్రాయం. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్న భావనతో పనిచేస్తున్న నాయకుడిగా అవినాష్ రెడ్డి గుర్తింపు పొందారని స్థానికులు పేర్కొంటున్నారు.