POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 9:30 pm Posted by : POLITICAL POWER

సమాఖ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జారె వినతి

CBO HR పాలసీ అమలు చేయాలని PR & RD కమిషనర్‌కు విజ్ఞప్తి

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: తెలంగాణ రాష్ట్రంలోని మండల, జిల్లా సమాఖ్యల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవ తీసుకున్నారు. ఈ మేరకు మండల, జిల్లా సమాఖ్యలకు చెందిన అకౌంటెంట్లు, ఆపరేటర్లు, అటెండర్లు తదితర ఉద్యోగులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సమాఖ్యల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమం, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి CBO HR పాలసీని అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగులకు న్యాయం జరిగేలా వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.