” సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి
తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల పరిపాలనలో చారిత్రక వైభవంతో విలసిల్లిన వరంగల్ నగరం, నేడు విద్యా, వైద్య, ఆర్థిక రంగాలు మరియు మౌలిక వసతుల కల్పనలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాజధాని హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకావడం ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఎంతో అత్యవసరం. అయితే ఒక ప్రాంతంలో నిర్మించే విమానాశ్రయానికి పెట్టే పేరు కేవలం ఒక చిరునామా మాత్రమే కాదు అది ఆ...