సామూహిక అక్షరాభ్యాసం – గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: పెద్దమందడి మండలం మణిగిల్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మరియు గురుకుల ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్వర్లు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ...