POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 10:27 pm Posted by : POLITICAL POWER

సాయి ఎక్సలెంట్ స్కూల్లో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్:/ ప్రతినిధి (మందలక్ష్మీనారాయణ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు గల సాయి ఎక్సలెంట్ స్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఆరెబోయిన శారదాదేవి జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన పుట్టినరోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సమయంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన విధానం ఉపాధ్యాయ వృత్తికి చాలా అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యా బోధనలు సాగించాల్సి వస్తుందన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనదని, ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా విద్యార్థులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఆరె బోయిన హుస్సేన్, నాగలక్ష్మి, శివ కుమారి, ఉపాధ్యాయులు సత్యవతి, నబీన, అనిత, ప్రశాంతి, రమేష్,అరుణ, నందిని, విద్య, కళ్యాణి, స్నేహ, పావని, సరోజ, రూప, రుచిత, శిరీష, తదితరులు పాల్గొన్నారు.