జి ఎమ్ కు వినతిపత్రం అందజేసిన ; తీగల క్రాంతి కుమార్
సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్ల కేటాయింపు చేపట్టాలని ఐఎన్‌టీయూసీ డిమాండ్
పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 టి వి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఏరియా ఉద్యోగులకు చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి ఏరియా పరిధిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టారం ఓసీపీ, జేవీఆర్ సీహెచ్‌పీ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సింగరేణి సంస్థ 2021 సంవత్సరంలో కౌన్సిలింగ్ నిర్వహించి పీవీఎన్ సెంటినరీ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ క్వార్టర్లను కేటాయించినందుకు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అయితే సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సత్తుపల్లిలో ఉద్యోగులకు ఇప్పటివరకు చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సత్తుపల్లి సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీనియారిటీ ప్రాతిపదికన చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్‌టీయూసీ తరఫున కోరారు. ఈ విషయంపై సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి, చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.