సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాల “”సన్నాహక సమావేశం””
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 19 2026: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కవులు, సాహితీవేత్తలు సమావేశమై 28.05.2026రోజు మొట్టమొదటి వనపర్తి శాసనసభ్యులు సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిరంజన్ రెడ్డి స్వగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాలలో ముఖ్య వక్తలుగా సాగునీటిరంగ నిపుణులు వి...